07-12-2023 RJ
తెలంగాణ
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోటా నిలిమ గారు మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు అర్హులకు కనీసం ప్రభుత్వ పథకాలు అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులను తామే గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందనివారు తమను సంప్రదించాలని సూచించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేయమని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందరికీ చేరుతాయని తెలిపారు.