08-12-2023 RJ
తెలంగాణ
ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు, రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై.. శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలు అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు హామీలను డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారెంటీలపై కూడా త్వరలోనే.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 200 ల యూనిట్ల వరకు ఉచితం అన్న హామీ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.