08-12-2023 RJ
తెలంగాణ
తెలంగాణ: సిద్దిపేట జిల్లా లోని తన ఫామ్‌హౌస్‌లో గురువారం రాత్రి జారిపడటంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తుంటి భాగంలో గాయమైంది. తుంటి ఎముకకు స్వల్ప గాయమైందని, నిపుణుల సంరక్షణలో ఉన్నారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కె.కవిత తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ కి ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కెసిఆర్ స్వల్ప గాయంతో ఆస్పత్రిలో చేరారని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు కవిత. అందరి మద్దతు, దీవెనలతో నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ట్వీట్ చేశారు.
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధకలిగిందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయం నుంచి కేసీఆర్ కోలుకోవాలి అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. పూర్తి టెస్టులు చేసిన వైద్యులు, కెసిఆర్ కు తొడ ఎముక విరింది పూర్తి రికవరీ అవ్వటానికి ఆరు నుండి ఎనిమిది వారాలు సమయం పడుతుందని హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి సూపరింటెండెంట్.