08-12-2023 RJ
తెలంగాణ
సనత్ నగర్ ఎమ్మెల్యేగా మూడోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శుక్రవారం కూడా నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, ఎస్ ఆర్ నగర్ లోని గణేష్ టెంపుల్, ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఆయా ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.
జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, మహంకాళి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, బల్కంపేట ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, కమిటీ సభ్యులు బచ్చు మహేష్, మహేందర్, దుబాయ్ శ్రీను, జగదీష్ ప్రసాద్, బల్కంపేట ఆలయ కమిటీ సభ్యులు పుష్పాలత, గౌతమ్, కూతురు నర్సింహ, రోజా రెడ్డి, నాయకులు రాజేష్, మైనార్టీ కమిషన్ సభ్యులు హిమాన్షు బాప్నా, FDC మాజీ చైర్మన్ అనిల్ కుమార్ కుర్మాచలం, జైన్ సేవా సంఘ్ అధ్యక్షులు యోగేష్ జైన్, అశోక్ జైన్, సురేష్ సురానా, సుభాష్ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.