09-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
- తిరుమల శ్రీవారి సేవలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం
- యాదవ్ సంఘం నాయకులూ, అభిమానులు డప్పు చప్పులతో ఘన స్వాగతం
- ఉదయం సుప్రభాత సేవలో
- స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు
తిరుమల: శుక్రవారం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి తిరుమల శ్రీవారిని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆయన తనయుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శించుకున్నారు. యాదవ సంఘం నాయకులు, భారీ గజమాలలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. దర్శనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.