10-12-2023 RJ
తెలంగాణ
- శ్రీ వినాయక స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు
కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఎస్ ఆర్ నగర్ లోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆలయ ఈఓ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభం తో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం నిర్వహకులు శాలువా, పూలమాలలతో సత్కరించి తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసరావు, సంద్యారాణి, శివ, కళ్యాణ్, శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, విటల్ నారాయణ, బీఆర్ఎస్ డివిజన్ అద్యక్షుడ్లు హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, గులాబ్ సింగ్, ఉత్తమ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
- ప్రభుత్వాసుపత్రిలో రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ప్రజోపయోగమైన కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్ పేట లోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం క్రింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లను ప్రకటించిందని, వాటిని వెంటనే అమలు చేసి చిత్తశుద్ధి ని చాటుకోవాలని చెప్పారు. మహాలక్ష్మి కార్యక్రమం క్రింద మహిళలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీ, 4 వేల రూపాయల పెన్షన్, 500 రూపాయల కే గ్యాస్ సిలెండర్ పంపిణీ ల అమలు కోసం అర్హులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వెంటనే అమలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ, ఆరోగ్యశ్రీ అధికారి దశరథ సింగ్, తహసీల్దార్ భీమయ్య గౌడ్, కూకట్ పల్లి డిపో డిఎం ఇషాక్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు అశోక్ యాదవ్, గులాబ్ సింగ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, గోపిలాల్ చౌహాన్, రాణి కౌర్, కర్నాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.