11-12-2023 RJ
తెలంగాణ
- కేసిఆర్ ను పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6 నుండి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని.. ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వివరించారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవలోకి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఐదారేళ్లు తర్వాత మాట్లాడుకుంటున్నారు.