11-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సంకేత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నుండి మూడోసారి భారీ మెజార్టీ తో ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్భంగా సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సంకేత్ సోషల్ అవేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సనత్ నగర్ లోని రవీందర్ నగర్ కాలనీ కి చెందిన విజయ్ ఆధ్వర్యంలో కాలనీ ప్రతినిధులు, ప్రశాంత్, ఇంకా నియోవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.