12-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: ఓట్ల కౌంటింగ్ రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై మంగళవారం ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిషనర్‌లను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్‌తో పాటు మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిసనర్ లను నియమించింది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా జి సుధీర్‌బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మొహంతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన వాళ్ళందరిని వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి కూడా కసరత్తు జరుగుతోంది.