13-12-2023 RJ
తెలంగాణ
- డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటాం
- క్విక్ రెస్పాన్స్ పనిచేస్తామని కమిషనర్ హామీ
హైదరాబాద్, (డిసెంబర్13): నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..డ్రగ్స్ ను వినియోగించినా.. ప్రోత్సహించి నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పబ్స్, బార్ల దగ్గర డ్రగ్స్ విక్రయించే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. చట్టాలను గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందన్నారు. సినీరంగం లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని.. డ్రగ్స్ నివారణకు పబ్స్, ఫాంహౌజ్ ఓనర్లు సహకరించాలని.. ఎలాంటి డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్ రెడ్డి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్, అక్టోఫన్లో ఆయన పనిచేశారు. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కునూటి అధికారిగా పేరు ఉంది. తన శక్తి, సామర్థ్యాలు గుర్తించి సీపీగా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్, జూదంను నిర్మూలిస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానన్నారు.
మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అలెర్ట్ ఉండాలన్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీస్ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధాన మని చెప్పుకొచ్చారు. మహిళల వేధింపులు, ర్యాగింగ్లపై షీ టీమ్స్ ద్వారా మరింత పని తీరును మెరుగు పరుస్తామన్నారు. తెలంగాణా స్టేట్ తో పాటు హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారన్నారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాడమే తమ లక్ష్యమన్నారు.
గతంలో డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపారన్నారు. హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలని.. లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాను హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ నే విస్తున్నట్లు గుర్తించామన్నారు. మారకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామన్నారు. సినీ పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.