13-12-2023 RJ
తెలంగాణ
- తనకు పోటీ ఎవరూ లేరన్న ధీమా
ఖమ్మం, (డిసెంబర్ 13): కాంగ్రెన్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు ప్రధాన నేతలు పొంగులేటి, తుమ్మల అసెంబ్లీకి ఎన్నిక కావడం, మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుకా చౌదరికి పోటీ లేకుండా పోయింది.
అలాగే సోనియా అండదండలతో ఆమెను కాదనే వారు ఉండకపోవచ్చు. దీంతో ఆమె ఇప్పటి నుంచే తన కార్యాచరణతో రంగంలోకి దిగారు. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య ఎక్కువవుతున్నా ఖమ్మంలో మాత్రం ఆమెకు పోటీలో నిలిచేవారు లేరనే అంటున్నారు. ఈ టిక్కెట్టుపై ఇప్పటికే కొంత మంది మాజీ ప్రజా ప్రతినిధులు గురిపెట్టగా.. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో మరికొందరు లిస్ట్ లో చేరారు.
ఎలక్షన్లకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఏడు సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్ కు రెండున్నర లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో పోటీదారుగా ఉన్నారు.
ఆమె 1999, 2004 ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెన్ తరఫున ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోగా, 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి సీటు కేటాయించడంతో కాంగ్రెస్ పోటీలో లేదు. 2019లో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.