13-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 13): ఎవరికి ఏ సమస్య ఉన్నా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండి మూడోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్బంగా బుధవారం కూడా ఆయనను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నార్త్ జోన్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిసి శంకరయ్య, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ కు చెందిన సుధాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వివేక్ నాథ్, డేవిడ్, ఈడెన్ అపార్ట్మెంట్ కు చెందిన మల్లన్న, నారాయణరాజు, లత, నాగలక్ష్మి, ఉమ లు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాభినందనలు తెలిపారు. అదేవిధంగా గాయత్రి నగర్ కు చెందిన వినోద్, శివ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారితో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్న ఫోటో ప్రేమ్ ను అందజేశారు.
బన్సీలాల్ పేట డివిజన్ కృష్ణా నగర్ కాలనీ అద్యక్షుడు రామచంద్రయ్య, సెక్రెటరీ మురళి, ప్రకాష్, గుజ్జుల రమేష్, భాస్కర్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అద్యక్షుడు మేకల రాములు యాదవ్, అమీర్పేట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కూతురు నర్సింహా, సుమిత్ సింగ్ నిఖిల్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, తదితరులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకురాగా, త్వరలోనే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.