ad1
ad1
Card image cap
Tags   Telangana Agriculture

  13-12-2023       RJ

అత్యాధునిక పద్ధతుల్లో.. రైతులకు లబ్ధిచేకూర్చేలా..

తెలంగాణ

- రైతులకు ఉపయుక్తంగా కార్యాచరణ చేపట్టాలి
- పంటల సాగుతో అత్యాధునిక పద్ధతులు అవలంబన
- 14 కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్, (డిసెంబర్ 13): ప్రపంచంవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.

బుధవారం నచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్వయసాయ రంగానికి చెందిన 14 కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో చర్చించారు. టిఎస్ ఆయిల్ ఫెడ్, టిఎస్ ఆగ్రో, మార్క్ ఫెడ్, టిఎస్ డీసీ, టిఎస్ ఎస్ ఓసీఏ, ట్రైబ్స్, హాకా, తదితర కార్పొరేషన్ల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్ధతులను అవలంబిం చాలన్నారు. పంటల సాగులో ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇతర దేశాల నుంచి అత్యాధునిక పద్ధతులను అందిపుచ్చుకుని రైతులకు లబ్ధిచేకూర్చేలా పనిచేయాలని సూచించారు. కార్పొరేషన్లు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేయవద్దని రైతులకు ఉపయోగపడేలా విధానాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాత పద్ధతులకు స్వస్తిపలికి సరికొత్త విధానాలతో రైతులోకానికి ఉపయుక్తంగా ఉండేలా కార్యాచరణ చేపట్టేలా కార్పొరేషన్లు పనిచేయాలన్నారు.

ప్రతీ కార్పొరేషన్ సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని వాటిని సక్రమమైన పద్ధతుల్లో అమలు పరిచేలా కార్పొరేషన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్లు చేసిన కృషి ఏంటో పూర్తి నివేదిక సమర్పించాలని ఆయా కార్పొరేషన్ల అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు.

రైతులకు నష్టం జరిగే ఎటువంటి విధానాలకైనా వెంటనే స్వస్తిపలకాలని సూచించారు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చే యంత్రాలు, ఎరువులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దన్నారు. అన్నిరకాల కార్పొరేషన్ల అభివృద్ధికి వెంటనే ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వచ్చే ఐదేళ్లకు అవసరమయ్యేలా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా, రైతులు సంతోషంగా ఉండేవిధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP