14-12-2023 RJ
సినీ స్క్రీన్
గడిచిన రెండు వారాలుగా దేశాన్ని ఉపేస్తున్న చిత్రం యానిమల్. ఇప్పటికే రూ.800 కోట్ల కలెక్షన్ల మార్కు దాటి సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం జెట్ స్పీడుగా రూ. వెయ్యి కొట్ల వైపు దూసుకెళుతున్నది. ఈ సినిమా ఎంత చర్చనీయాంశం అయిందో ఇందులో నటించిన వారికి అంతే పేరొచ్చింది.
ముఖ్యంగా ఇందులో కథానాయికగా చేసిన రష్మిక కన్నా జోయా అనే చిన్న గెస్ట్ రోల్లో రణబీర్ కపూర్ తో రోమాన్స్, ఇంటిమేట్ సీన్స్ చేసిన నటి త్రిప్తి డిమ్రి నేషనల్ వైడ్ గా స్టార్ స్టేటస్ వచ్చేసింది. అంతేకాక ఐఎండీబీలో పాపులర్ నటి జాబితాలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఇదిలాఉండగా త్రిప్తి డిమ్రి ఆ చిత్రంలో నటిస్తుందని, ఈ చిత్రంలో నటిస్తుందంటూ అన్ని ఇండస్ట్రీ సోషల్ మీడియా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అమె ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఏ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదని, వాటి కోసం ఎదురు చూస్తున్నానని స్పష్టం చేసింది.
నాకు సౌత్లో. ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని అందుకు ఛాన్స్ కోసం చూస్తున్నానని అ అవకాశాన్ని అసలు వదులుకోనని అన్నది. దీంతో పలువురు అభిమానులు ఎన్టీఆర్ అప్ కమింగ్ సినిమాలో అవకాశం ఇవ్వాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఆమె మాట్లాడుతూ యానిమల్ సినిమా గురించి సినిమాలో నేను నటించిన సన్నివేశాలను చూసి నా తల్లిదండ్రులు షాక్ అయ్యారని వారికి ఇది జాబ్లో భాగంగా చేశానని చెప్పానని ఆయిన ఇంకా వారు షాక్లోనే ఉన్నారని తెలిపింది.
నేను సినిమా కోసం చాలా కష్టపడ్డానని ఇప్పుడు నా పాత్ర సక్సైన్ అయి నేను ఊహించనంత పేరు తీసుకువచ్చిందని అన్నారు. ఇదిలాఉండగా ఈ సినిమా అనంతరం సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య 600కే నుంచి ఒక్కసారిగా 35 లక్షలకు చేరడం గమనార్హం.