14-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలని పేర్కొన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామని తెలిపిన జగన్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు.
ఆరోగ్యశ్రీ పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కఅషి చేసింది.
ఇందులో భాగంగానే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం అని సీఎం పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి.