14-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 14): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులతో కలిసి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్ గా నియామకమైన గడ్డం ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.