14-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్14): గురువారం మాజీ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడస్తుందో చూస్తానని కెటిఆర్ అనడం సరైనది కాదు అని సూచించారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసన్నారు. 60 వేల కోట్లు ఉన్న అప్పులను 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
బంగారు తెలంగాణ పేరుతో అప్పులకుప్పగా చేసి నీతులు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేశారని చెప్పారు. 8 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 40 వేల కోట్లకు తీసుకెళ్లారని వెల్లడించారు.