14-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి, (డిసెంబర్14): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా లైను కొత్తూరులో రోడ్డు మార్గంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ మూడవరోజు నమ్మె చేస్తున్న దీక్ష శిబిరాన్ని నందర్శించారు. వారి సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అయితే అంగన్వాడీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. కాగా యువనేత లోకేష్ పాదయాత్రకు అడుగడుగున ప్రజలు నీరాజనం పలుకున్నారు.
నిన్నటి వరకు నడిచిన మొత్తం దూరం 3059.6 కి.మీ. కాగా లోకేష్ పాదయాత్రలో తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు కొత్తూరు సెంటర్లో సభ నిర్వహించనున్నారు. వివిధ వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీల ఇస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.