14-12-2023 RJ
సినీ స్క్రీన్
రీసెంట్ గా శేష్ ఈఎక్స్ శృతి అంటూ అడివి శేష్ కలిసి నటిస్తున్నట్లుగా ఓ అప్డేట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి నటిస్తోన్నఈ మెగా పాన్ - ఇండియా యాక్షన్ డ్రామా నుంచి మేకర్స్ గురువారం సెన్సేషనల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ అడివి శేష్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ రివీల్ పోస్టర్ తో డిసెంబర్ 18న విడుదల కానుంది.
తాజాగా మేకర్స్ విడుదల చేసిన అడివి శేష్ ఇంటెన్స్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ ఇమేజ్ తీక్షణమైన చూపులతో, ముఖాన్ని బ్లాక్ స్కార్ఫ్ తో కప్పుకొని కనిపించారు అడివి శేష్. అతని కుడి చెవిలో బంగారు చెవిపోగులు, అతని నుదిటిని కప్పి ఉన్న లాంగ్ లాక్స్ లుక్కు స్టైల్, స్వాగ్ని జోడించాయి.
ఆసక్తికరంగా, ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ లో అడివి శేష్ ఫస్ట్ లుక్ చిత్రాన్ని పోస్ట్ చేసి తనని పరిచయం చేస్తున్నాము..
అతని రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా?
టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న అని రాశారు. 'సినిమాలోని ప్రతి ఫ్రేమ్, డైలాగ్, సన్నివేశాన్ని హిందీతో పాటు తెలుగులో విడివిడిగా చిత్రీకరిస్తున్నాం. ప్రతి భాష సాంస్కృతిక ప్రత్యేకత బట్టి దీనిని విభిన్నంగా ట్రీట్ చేస్తున్నాం' అని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మెగా ప్రాజెక్ట్ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్'.. బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అడివి శేష్కు రెండో స్టయిట్ హిందీ మూవీ కానుంది. అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి'తో సహా పలు తెలుగు బ్లాక్ బస్టర్ కు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్ కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారికంగా ఎంపికైన 'లైలా' అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిలిం కు ఆయన దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోన్న.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడి కానున్నాయి.