14-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ స్టార్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ ను డిసెంబర్ 19న లాంఛ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్ లోని ఏషియన్ మహేష్ బాబు మాల్ లో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.