14-12-2023 RJ
సినీ స్క్రీన్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం 'నా సామిరంగ'. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ పాటు ఫస్ట్ సింగిల్ ను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో స్టార్ కాస్టు చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్తది అంటూ.. ఇక అంజి గాడికి సంబంధించిన స్పెషల్ ఇంట్రో ప్రోమోను రేపు ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట చూస్తే.. హీరో హీరోయిన్ల మధ్య సాగే కలర్ ఫుల్ ట్రాక్ సినిమాకు హైలెట్ కానుందని విజువల్స్ చెబుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.