15-12-2023 RJ
సినీ స్క్రీన్
ఈమె పేరు కొన్ని రోజులవరకు అంతగా ఎవరికీ తెలియదు, కానీ 'యానిమల్' సినిమా విడుదలయ్యాక రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఇంతకీ ఈమె ఆ సినిమాలో కథానాయికగా నటించలేదు, రెండో సగంలో మాత్రమే చిన్న పాత్రలో కనపడుతుంది. మరి ఈమెకి ఎందుకు క్రేజ్ అంటే, ఆమె చేసిన సన్నివేశం అటువంటిది మరి. త్రిప్తి డిమ్రి 'యానిమల్' లో కథానాయకుడు రణబీర్ కపూర్ తో ఒక నగ్న సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించింది.
అంతకు ముందు ఆమె కొన్ని హిందీ సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ చేసినా ఆమెకి ఇంతగా పేరు రాలేదు, కానీ ఈ 'యానిమల్' సినిమాలో చేసిన ఆ ఒక్క సన్నివేశానికి ఆమెకి విశేష గుర్తింపు వచ్చేసింది. దీంతో ఇప్పుడు అంతా ఆమె ఎవరు అంటూ వెతుకులాట ప్రారంభించారు. 'యానిమల్' సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న వేసింది, ఆమెని అందరూ 'నేషనల్ క్రష్' అంటారు.
అయితే ఈ సినిమా విడుదలయ్యాక, రష్మిక తో పాటు ఈ త్రిప్తి డివ్రిని కూడా అందరూ 'నేషనల్ క్రష్' అని అంటున్నారు. నేషనల్ క్రష్ చెల్లెలు అని, ఇలా ఏవేవో పేర్లు పెట్టి ఈమె ఎక్కడ ఏమి మాట్లాడినా అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. త్రిప్తి డివ్రికి ఈ సినిమా విడుదలయ్యాక వేలల్లో ఫాలోవర్స్ పెరిగారని తెలుస్తోంది. ఆమెకి ఇంతకు ముందు సాంఘీక మాధ్యమంలో తక్కువగా ఫాలోవర్స్ ఉంటే, ఈ సినిమా విడుదలయ్యాక ఒక్కసారిగా పెరిగిపోయారని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఇప్పుడు 30 లక్షల 70 వేలుకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.