15-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్15): ఎప్పుడూ సరదాగా మాట్లాడే మాజీమంత్రి మల్లారెడ్డి మరోమారు తన దైన శైలిలో స్పందించారు. అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంలో వెనకాడనని అన్నారు. అసెంబ్లీ నుంచి బయటికి వస్తుండగా మాజీ మంత్రి మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు.
తీన్మార్ మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇరువూరూ పలకిరించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య అసక్తికర సంభాషణ జరిగింది. తీన్మార్ మల్లన్న మేడ్చల్లో పోటీ చేస్తే ఎవరో ఒక మల్లన్నే అసెంబ్లీలోకి వచ్చేవారని మల్లారెడ్డి అన్నారు. ఇద్దరు మల్లన్నలు వచ్చేవారు కాదన్నారు.
కాంగ్రెస్ కు శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువ అయితే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా.. కచ్చితంగా ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు తర్వాత అందరం ఒక్కటే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ముక్తాయింపునిచ్చారు. అవసరం అయితే అప్పుడు చూద్దాంలే అని అనడం విశేషం.