15-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
- ఆరోగ్యశ్రీలో పరిమితి 25లక్షలకు పెంపు
- విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం
- వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటు
- ఈ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్
- ఏపి కేబినేట్ కీలక నిర్ణయాలు
అమరావతి, (డిసెంబర్15): పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆరోగ్య శ్రీలో చికిత్స పరిమితి రూ. 25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు చేయనున్నట్లు పేర్కొంది. 'మిగ్ జాం' తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ కు కేబినెట్ ఆమోదం, అలాగే విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం లభించింది. కేబినేట్ వివరాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వెల్లడించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణల కు ఆమోదం ఇచ్చింది. వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం, అలాగే ఈ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎపీ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో పేదలకు రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం ఆమోదిస్తూనే.. 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు అందనున్నాయని వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగామన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.
జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం లభించింది. కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇకనుంచి డీఏ, డీఆర్ చెల్లింపు చేస్తారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే టీమ్స్ కు 15శాతం అలవెన్స్ పెంపుతూ నిర్ణయించారు.
51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేస్రన్ జరిగింది. ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్ గా అంబటి రాయుడును నియమించారు. కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ అమోదం ఇచ్చింది.