15-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 15): సనత్ నగర్ డివిజన్ బికె గూడ పార్కులో ఉదయం వేళలో వయోవృద్ధులు తాకిడి ఎక్కువ అవుతున్నందువలన అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వలన వయోవృద్ధులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీనియర్ సిటిజన్ కౌన్సిల్స్ సభ్యులు ఎన్నికల ముందు స్థానిక కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లి బి.కె గూడ పార్కులో మాకు టాయిలెట్స్ కావాలని కోరారు.
అప్పుడు మంత్రి గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే కార్పొరేటర్ కి పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్స్ కోడ్ వచ్చినందువలన కొంత సమయం తీసుకుని ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి బికే గుడా పార్కులో టాయిలెట్స్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే తలసానికి వయోవృద్ధులు అందరు కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోలను బాల్ రెడ్డి, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు జె ఈ సందీప్, సూపర్వైజర్ అన్వర్, సీనియర్ సిటిజన్ కౌన్సిల్స్ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, సహదేవ్ గౌడ్, మాధవరావు, కుమార్, యాదగిరి, లింగమయ్య, బాలు, తదితరులు పాల్గొన్నారు