15-12-2023 RJ
సినీ స్క్రీన్
ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ ని కూడా మొదలెట్టారు. ఊహించని విధంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. సంక్రాంతికి రావడం పక్కా అనేలా సిద్ధమవుతోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సెకండ్ సింగిల్ మాత్రం.. భారీగా ట్రోలింగ్కు గురవుతోంది. 'గుంటూరు కారం'కు సంబంధించి మొదట విడుదలైన 'థమ్ మసాలా' సాంగ్ అందరినీ అలరించింది. అదే ఊపులో సెకండ్ సింగిల్ కు సంబంధించి విడుదలకు ముందు చేసిన హడావుడి.. సాంగ్ పై భారీగా అంచనాలను పెంచేసింది. తీరా.. సాంగ్ విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంతా నిరాశకు లోనవుతున్నారు.
అందుకు కారణం.. విడుదలకు ముందు చేసిన హడావుడంత గొప్పగా లేకపోవడమే. థమన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.. ఏదీ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అంతే సోషల్ మీడియా వేదికగా.. థమన్ని, రామని ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ ట్రోలింగ్ పై అసహనం వ్యక్తం చేసిన రామజోగయ్య శాస్త్రిని మరింతగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో చేసేది లేక.. ట్విట్టర్ కు రామజోగయ్య బై బై చెప్పేశారు.
వాస్తవానికి 'ఓమై బేబీ' అంటూ మహేష్ బాబు, శ్రీలీల మద్య వచ్చిన ఈ పాటలో.. సూపర్ స్టార్ గత సినిమాలకు లింక్ అయ్యేలా రామజోగయ్య సాహిత్యాన్ని అల్లారు. కానీ ట్యూన్ క్యాచీగా లేకపోవడంతో.. లిరిక్స్ కూడా పెద్దగా శ్రోతలకు ఎక్కలేదు. . అసలు ఇది పాటేనా ఏం ఊహించుకుని రాస్తున్నారు..
ఆ ఇంగ్లీష్ పదాలేంటి? హీరో ఎవరని అనుకుంటున్నారు ఇంత చెత్త పాట ఇంత వరకు వినలేదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా భగ్గుమన్నారు. ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి.. ప్రతివాడూ మాట్లాడే వాడే... రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది.
పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని.. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం... తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి అంటూ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చినట్లుగా ట్విట్టర్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. రామజోగయ్య శాస్త్రిపై నెటిజన్లు ఒక రకంగా యుద్ధమే మొదలెట్టారు. ఈ యుద్ధాన్ని తట్టుకోవడం రామ్ వల్ల కాలేదు. అందుకే 'మీకో దండంరా నాయనా' అనేలా ట్విట్టర్ అకౌంట్ మూసేసి.. ముగింపు పలికారు.