15-12-2023 RJ
సినీ స్క్రీన్
పాపులర్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం బబుల్గమ్. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన బబుల్గమ్ ప్రీ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం బబుల్గామ్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. నా డెస్టినీలో ఏం రాసిపెట్టిందో నాకు తెల్వదు.
కానీ నచ్చినట్టు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అంటూ హీరో చెప్పే డైలాగ్స్ షురూ అయింది ట్రైలర్. ఎవడు పడితే వాడు చేతులేశాడనుకో.. చేతులు నరికేస్తానంటున్నాడు రోషన్. హీరోహీరోయిన్ల డిఫరెంట్ లవ్ ట్రాక్ తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ప్రేమ బబుల్ గమ్ లాంటిది.. మొదట్ల తీయగుంటది.. తర్వాత అంటుకుంటది.. షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్ పండవెట్టేస్తది.. అంటూ సాగే డైలాగ్స్ సాగుతున్న బబుల్ గమ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. బబుల్గమ్ లో ప్రీ లుక్ పోస్టర్ లో హీరో హీరోయిన్లు సూపర్ రొమాంటిక్ మూడ్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సురేశ్ రగుతు సినిమాటోగ్రాఫర్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాల తర్వాత రవికాంత్ పేరెపు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.