15-12-2023 RJ
సినీ స్క్రీన్
గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ సలార్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా రానుండగా.. తొలిపార్ట్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ తేదీ పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేడేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. సలార్ మరో వారంలో సందడి చేయనుండటంతో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ నా 21 ఏండ్ల కెరీర్లో ఉత్తమ డైరెక్టర్ అని చెప్పుకొచ్చాడు.
గత 21 ఏండ్లలో నాకు ఒక్కసారి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. కేవలం నెలలోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ప్రశాంత్ నీలో భారీ కమర్షియల్ సినిమా చేస్తున్నానని చెప్పాడు ప్రభాస్. ఇటీవలే సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే లిరికల్ వీడియో సాంగ్న లాంఛ్ చేశారు మేకర్స్. సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు.. అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన సూరీడే లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్ నిలుస్తోంది. సలార్లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.