16-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి: మరో మూడు నెలల్లో జగన్ ఔట్ అంటూ మాజీ సిఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల తర్వాత జగన్ అడ్రస్ ఉండదని అని స్పష్టం చేశారు. ఏపీలో పాలన అస్థవ్యస్తమయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితులు గాడిలో పడాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
పెరిగిన నిత్యవసరాలతో ప్రజలు సతమతమవుతుంటే వైసీపీ నాయకులు ఇసుక దోపిడీలో తలమునకల య్యారని అగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 20 నుంచి తాను నియోజకవర్గాలలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు టీడీపీలో చేరే అవకాశం.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలన్నారు. జనవరి నుంచి సైకిల్ స్పీడ్ పెరుగుతుందని చెప్పారు. వైసీపీ చిల్లు పడిన నావ అని ఎద్దేవా చేశారు. ఆ పడవ నుంచి దూకి పారిపోయిన వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటారు.. లేని వారు చరిత్రలో కలిసిపోతారని చెప్పారు.
జగన్ కనీసం తన అపాయింట్మెంట్ అమ్మకు కూడా ఇవ్వడని, అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని జగన్ ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యంగా ఇంట్లో పని వాళ్ళను కూడా మార్చం కానీ.. జగన్ మాత్రం ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు మార్చుతున్నారు.
ఎమ్మెల్యేల చేత తప్పుడు పనులు చేయించాడు.. ఇప్పుడు పక్కన పెట్టాడు. చిల్లర పదవులు బలహీన వర్గాలకు ఇచ్చి దానినే సామాజిక న్యాయం అని జగన్ కలరింగ్ ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తన ఎంపీలను గుమాస్తాలకంటే హీనంగా జగన్ చూస్తున్నారు. అత్మాభిమానంతో ప్రవర్తిస్తే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. అందుకు ఉదాహరణళి ఎంవీ రఘు రామకృష్ణంరాజు కేసని అన్నారు.
వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. అగా పడ్డ రాష్ట్రాన్ని కాపాడటం కోసం టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. ప్రజలు వివేకంతో ఆలోచించాలి. రాష్ట్ర విభజన తర్వాత నేను చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగిస్తే తెలంగాణతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చెందేది. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు కేసులు కారణంగా మీన మేషాలు లెక్కిస్తున్నాడు. కేంద్రం మెడలు వంచి మరీ హోదా తెస్తానని చెప్పి.. తన మెడలనే కేంద్రం వద్ద దించుకొన్నాడు.
టీడీపీ ప్రభుత్వం ఉంటే 2020 లోనే పోలవరం పూర్తి అయ్యేది. 2019 లో టీడీపీ అధికారంలోకి వచ్చినట్లేతే 2020లోనే పోలవరం పూర్తిచేసి సాగుకు నీరందించే వాళ్లం అని చంద్రబాబు తెలిపారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలను విరక్కొడుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయడని విమర్శలు గుప్పించారు. తల్లి, చెల్లికి కూడా సమయనీ ఇవ్వని వాడు ఇక ఎమ్మెల్యేలకేం టైమ్ ఇస్తాడని అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టాడని అన్నారు. ఆంధ్రప్రదేశను కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ - జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, అన్ని సంప్రదాయాలను సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ఎంత మందిని మార్చినా వైకాపాను ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు.
బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందులదేనని పేర్కొన్నారు. 5 ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ ఎవరి జీవన ప్రమాణాలైనా మారాయా లేదా అని ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలని చంద్రబాబు కోకారు. డీఎస్సీ పెట్టి ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని జగన్ ఎలా చెప్తాడని చంద్రబాబు ప్రశ్నించారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గంజాయి మాత్రం ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏళ్ల టీడీపీ పాలనతో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు బెరీజు వేసుకోవాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తీసుకొస్తా అని హామీ ఇచ్చారని, అవన్నీ ఏమయ్యాయని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉంటే 2020లో పోలవరం పూర్తి చేసే వాళ్లమని, తన స్వార్థం కోసం పోలవరం ప్రాజెక్ట్క నష్టం చేకూర్చారని విరుచుకు పడ్డారు.
జనవరిలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అని చెప్పి కనీసం ఒక్క ఎడాది కూడా ఇవ్వలేదని ప్రస్తావించారు. జగన్కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్ ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయపరమైన కోరికలు పరిష్కరిస్తామని అన్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక సందర్భంగా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.