16-12-2023 RJ
తెలంగాణ
తెలంగాణలో గ్యాస్ ఏజెన్సీలకు జనం పోటెత్తుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ వ్యాప్తంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితోదంలా రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి, ఈ-కెవైసి కోసం మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. లేదంటే సబ్సిడీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ రూ.500కే సిలిండర్ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న వదంతులు. వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ప్రభుత్వం. కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించింది లేదు.
అయితే వీళ్లంతా కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసమా, లేక కేంద్రం ఇచ్చే ఉజ్వల స్కీమ్‌లో భాగంగా ఏజెన్సీలకు పోటెత్తుతున్నారా అనేదానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, అవన్నీ పుకార్లే అని ఉన్నతాధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తేల్చి చెప్పారు.