ad1
ad1
Card image cap
Tags   Andhra Pradesh

  16-12-2023       RJ

ఐదోరోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ఆంధ్రప్రదేశ్

విజయవాడ, (డిసెంబర్16): అంగన్వాడీల సమ్మె మరింత ఉదృతంగా సాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని అంగన్వాడీ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మూడుసార్లు చర్చలు జరిపినా పురోగతి లేదని, ప్రభుత్వం మొండి వైఖరితో ఉందనీ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటమ్ జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం ఐదోరోజుకు చేరుకుంది రోజు రోజుకు వివిధ రూపాలలో అంగన్వాడీలు జనాల మద్దతు కూడగట్టుకుంటూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. శనివారం ఆదోని పట్టణంలో దుకాణాల ముందు బిక్షటన చేస్తూ అంగన్వాడీలు నిరసన చేపట్టారు.

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని కోరుతున్న.. సీఎం జగన్ పట్టించుకోవడంలేదని యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తామన్నారు. తమ పట్ల కనికరం చూపకుండా సెంటర్లను తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయించడం సమంజసం కాదన్నారు. ఉద్యమాన్ని నేరగారించేందుకు ఎన్ని కుయుక్తులు చేసిన ముందుకు సాగుతాం అన్నారు.

కశింకోటలో అంగన్వాడి కార్యకర్తలు 5 ఐదో రోజు సమ్మె శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటీయు అధ్యక్షులు శంకరరావు ముఖ్యంగా అతిధిగా పాల్గొన్నారు. అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. 26000 పెంచాలని డిమాండ్ చేశారు. ముందుగా ఎమ్మెల్సీషేక్‌ షాబ్జికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కౌలు రైతు సంఘం జిల్లా కోశాధికారి తెళ్యియి బాబు జిల్లా సిఐటియు నాయకులు డి శ్రీనివాస రావు ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు తనుజ తనుజ వరలక్ష్మి కాసులమ్మ పాల్గొన్నారు. అంగన్వాడి కార్యకర్త సమ్మకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు న్యాయవాది శ్రీనివాసరావు కత్తిరి శ్రీధర్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి చిత్రపటానికి అంగన్వాడి కార్యకర్తలు, సిఐటియు, వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం ఉంగుటూరులో నివాళులు అర్పించారు. అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె శిబిరం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. షాబ్జికి చేసిన పోరాట ఉద్యమాలను ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు వివరించారు. కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కొర్ని అప్పారావు అంగన్వాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి జిల్లా మారేడు మిల్లిలో తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కొనసాగిస్తున్న సమ్మె శనివారంతో ఐదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం మారేడుమిల్లి మండలంలోని అంగన్వాడీలు సమ్మె ప్రారంభానికి ముందుగా ఎమ్మెల్సీ షేక్ షాబ్జికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండలం అంగన్వాడి, మినీ అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మెను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు మండల కేంద్రాలలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగించారు. సిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీలు సమస్యల సాధన కోసం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ దీక్ష శిబిరం వద్దకు చేరుకొని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ 5 రోజులు పాటు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విధులు నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం మానుకొని వారి న్యాయమైన డిమాండ్ లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేసేందుకు కుట్ర పడడం సమంజసం కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను భయాందోళన గురి చేసే విధంగా ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలు ఏపీఎంలు పోలీసులు సచివాలయ సిబ్బందితో అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టి నిరంకుశంగా పాలన సాగిస్తే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.

మండల స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు వారికి కేటాయించిన పనులు చేయలేక సతమతమవుతుంటే కలెక్టర్లు ఒత్తిడితో అంగన్వాడి సెంటర్లను నిర్వహించాలని ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఇబ్బందులను సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్ లో పెట్టిన సెంటర్, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి,రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు. పిల్లలకు, బాలింతలకు నాణ్యతలేని బాలామృతం, గుడ్లు,చిక్కీలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం మానేసి, విజిట్ల పేరుతో ఫుడ్ కమిషనర్,అధికారులు అంగన్వాడీలను వేధిస్తున్నారన్నారు.

ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (ఎఫ్.ఆర్.ఎస్) వచ్చాక అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం పని పక్కకుపోయి బాలింతలు చుట్టూ ఇళ్లకు, హాస్పిటల్స్ చుట్టూ అంగన్వాడీలు తిరగాల్సివస్తుందన్నారు. తక్షణ అన్ని యపులను కలిపి ఒకే యాప్ చేయాలన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు చెల్లించికపోతే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ఆయాల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ప్రభుత్వ నిబంధనల అమలుకోసం ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలియచేశారు.

పక్కనున్న రాష్ట్రాలలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అధికారాలు కోల్పోవాల్సిన పరిస్థితినీ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన పోరాడే హక్కుద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP