16-12-2023 RJ
సినీ స్క్రీన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమాపై బజ్ పీక్స్ లో ఉంది. అయితే సరైన అప్డేట్ రావడం లేదు, శంకర్ 'భారతీయుడు-2 సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతోంది.
ఇటీవల మైసూర్ షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో టీమ్ బ్రేక్లో ఉన్నారు. తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ రెడీ అవుతోంది కానీ ఎప్పుడనే అప్డేట్ లేదు. తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం డిసెంబర్ 26న గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ చేయడానికి శంకర్, చరణ్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ముందు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ షెడ్యూల్ చిన్నగానే స్టార్ట్ చేశారట. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మాత్రమే ఈ షార్ట్ షెడ్యూల్ జరగనుందని సమాచారం.
జనవరి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తే గేమ్ ఛేంజర్ సినిమా 2024 ఫిబ్రవరిలో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదే ఎ-లాన్ వర్కవుట్ అయితే సమ్మర్లో ఈ చిత్రం విడుదలకు రెడీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై చిత్ర బృందం ఏదైనా అప్డేట్ ఇస్తే బావుంటుందని మెగా అభిమానులు కోరుకుంటన్నారు. ఈ చిత్రం తర్వాత రామ్చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓయ చిత్రం చేయనున్నారు.