16-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్16): విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పలికారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ పదో స్థానంలో ఉందని కేంద్రం చెప్పినట్లు పునరుద్ఘాటించారు. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే, పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగిందని నిలదీశారు.
- విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది అబద్ధం
- తెలంగాణ పదో స్థానంలో ఉందని కేంద్రం చెప్పింది
- రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది
- గతంలో ప్రగతిభవన్లోకి హెూంమంత్రికి కూడా ప్రవేశంలేదు
2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలు ఉన్నాయని తెలిపారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని, గత పదేళ్లలో 8 వేలకు పైగా రైతులు అత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్ నివేదిక చెప్పినట్ల రేవంత్ గుర్తుచేశారు. రైతుబీమా కింద 1.21 లక్షల మంది రైతులకు పరిహారం ఇచ్చారని, పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని విచారం వ్యక్తం చేశారు.
రైతు పంటలకు, రైతు జీవితానికి బీమా, ధీమా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం చనిపోయాక రూ.5 లక్షలు ఇచ్చిందని విమర్శించారు. వరి వేస్తే, ఉరే అని చెప్పిన కేసీఆర్ తన ఫామ్హస్లో 150 ఎకరాల్లో వరి వేశారని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిన పండ్లను క్వింటాలుకు రూ.4,250 చొప్పున అమ్ముకున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపినందుకు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్నే రద్దు చేసిందని రేవంత్ గుర్తుచేశారు.
తొలి మంత్రివర్గ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించామన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని సభాముఖంగా రేవంత్ వివరించారు. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్లోకి పిలిపించుకున్నారా, ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన వారి కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా అని బీఆర్ఎస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం డీఎస్పీ ఉద్యోగం వదులుకున్న నళినికి ఏమీ న్యాయం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదని విమర్శించారు. ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేశారని రేవంత్ దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించినట్లు తెలిపారు. కావాలనుకుంటే ఇప్పుడు కేటీఆర్, బీఅర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు: రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఓటమి తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశించాను కానీ వృథానేనని రేవంత్ పలికారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా కానీ అలాజరగలేదు. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. మా పార్టీ, మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువకాలం చెల్లదని హితవు పలికారు. ప్రగతిభవన్ గడీలు బద్దలు కొట్టాక ప్రజలు భారీగా తరలివస్తున్నారని తెలిపారు.
గతంలో ప్రగతిభవన్లోకి హెూంమంత్రికి కూడా ప్రవేశం ఉండలేని పరిస్థితి నెలకొందని వివరించారు. హెూంమంత్రిని ఒక హెూంగార్డు అడ్డుకుని వెనక్కి పంపించారని, ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న సైతం ప్రగతిభవన్ ముందు గంటల కొద్దీ నిలబడ్డారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజాభవన్కు ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు.
మొన్నటి వరకు సీఎంను కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేదని, ఇప్పుడు ఎవరు వచ్చినా, ప్రజల సమస్యలు వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని కూనంనేని తెలిపారు. హామీలు నెరవేర్చడానికి డబ్బు ఇబ్బంది కాదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ౨ హామీలు నెరవేర్చారు. ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామన్నారు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్న కూనంనేని, ఈ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో చూస్తామనడం మంచిదికాదని అన్నారు. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోర్డారు. పాత ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందో కాంగ్రెస్ చెక్ చేసుకొని పనిచేయాలని సూచించారు.
బీఆర్ఎస్ ఓడిపోడానికి చాలా కారణాలు ఉన్నాయని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీగా వచ్చిన బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని కూనంనేని పలికారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని అక్బరుద్దీన్ అన్నారు. అప్పట్లో ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చామని గుర్తుకు చేశారు.
పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు. పాతబస్తీలో అభివృద్ధికి సీఎం సమీక్ష చేయాలని కోరారు. గవర్నర్ ప్రసంగం మెత్తం కాంగ్రెస్ హామీల గురించే చదివారని మహేశ్వర్రెడ్డి అన్నారు. మ్యానిఫెస్టోకు చట్టబద్ధం లేకుంటే దానికి విలువ ఉండదని తెలియజేశారు. చాలా హామీలు ఇచ్చారని కానీ అరు హామీల గురించే మాట్లాడుతున్నారని తెలియజేశారు.
ప్రజావాణి పేరిట పబ్లిసిటీ చేస్తే బీజేపీ సహించదని అన్నారు. ప్రతిరోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులే అని అంటున్నారని ప్రశ్నించారు. అప్పులను చూపించి హామీలు అమలు చేయకుండా ఉంటే సహించేది లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేశామని కేటీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ కోసం అప్పులు చేశామని కేంద్రంపై పోరాడటానికి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని అన్నారు.
ప్యానల్ స్పీకర్ల పేర్లను ప్రకటించిన సభాపతి ప్రసాద్ కుమార్ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్ పేర్లను సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు.? ప్యానల్ స్పీకర్ లుగా కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పేర్లను సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు.మా పాలనలో అప్పులు గురించే చెప్తున్నారని మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదని కేటీఆర్ అన్నారు. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలీడే ఇవ్వని ఘనత కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు.
ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేసింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. అనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి చంపింది ఎవరో చెప్పాలని అన్నారు. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారని పదేళ్ల పాలన గురించి శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. ట్రాన్స్కో ఆస్తులు రూ.24,470 కోట్లు, జెన్కోరూ.53,963 కోట్లు సృష్టించామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాతున్నామని అన్నారు.
రాష్ట్రంలో అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ.1.37,571 కోట్ల ఆస్తులు సృష్టించామని తెలిపారు. విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్పా అప్పులు చూపించి గృహజ్యోతి పథకం నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని తెలిపారు. విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్ గా ఉందన్నారు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా దిల్లీ నామినేట్ చేసిన వ్యక్తి సీఎం అయ్యారని కేటీఆర్ అన్నారు. పదేళ్లలో మహబూబ్ నగర్ వలసలు ఆగిపోయాయని తెలిపారు.
ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని అన్నారు. మేము స్వాగతిస్తాం కోటిన్నర మంది మహిళల ఖాతాలో రూ.2,500 వేస్తారన్నారని రూ.2,500 ఖాతాలో ఎప్పుడు వేస్తారో అని మహిళలు వేచిచూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన చూసి ప్రజలు తీర్పు ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించాలని తెలిపారు.
గతంలో ఆరుగురు మంత్రులు 14 నెలల్లో రాజీనామా చేశామని హరీశ్ రావు అన్నారు. పులిచింతల అపకపోవడం వల్లే కేబినెట్ నుంచి వైదొలుగుతున్నామని రాజీనామా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత 'బీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ పాలనలో గురించి చెబుతామని కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం అంటే కుదరదని తెలిపారు.
గత 10 ఏళ్ల పాలన గురించి చెబుతామని, కాంగ్రెస్ సభ్యులు మిడిసిపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా కట్టిన వ్యవస్థలు, సంస్థలను ధ్వంసం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. నిర్మాణాత్మకమైన సూచనలు చేసినా స్వీకరిస్తామని అన్నారు. తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర బీఆర్ఎస్ఏ అని భట్టి విక్రమార్క విమర్శించారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని కేటీఆర్ అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయని చెప్పారు. దీఅర్ఎస్ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. ప్రజల తరపున గొంతు విపుతామని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని ఆరోపించారు. గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేదు, మంచినీటి సమస్యలు ఉండేవని విమర్శించారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్ గంజి కేంద్రాలు ఉన్నాయని కేటీఆర్ వివరించారు.
రాష్ట్రంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్య ఉందని స్థానికులు చెబుతున్నారని ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో అవకతవకలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో చాలా అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం కూడా కమీషన్ల ప్రాజెక్ట్ అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. అన్ని వసతులు ఉన్నా రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారని విమర్శించారు.
విద్యుత్ విభాగంలో రూ.80,000ల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోందని జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని, కేంద్రం వివక్ష వల్ల జాతీయ హెూదా సాధించలేకపోయామని పేర్కొన్నారు.
కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలన్నారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత తగదని వివరించారు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారని, కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు. మిషన్ భగీరథ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించామని చెప్పారు. ఉచిత ప్రయాణాల కోసం రూ.374 కోట్లు విడుదల చేశామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వికారాబాద్ జిల్లాలో పేద ప్రజలకు ఇళ్లు కట్టించలేదని ఆరోపించారు. త్వరలో గృహజ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తామని వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సమాధానం అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.