16-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్16): రాష్ట్రవ్యాప్తంగా 2022లో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా ఎస్పీలు, డిఐజిలు, ఐజి లు, అడిషనల్ డిజిలను గుర్తించి వారు అందించిన సేవల అర్హత అదరంగా 65 మందికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి డిస్క్ అవార్డులను,మెడల్స్ ను ఈ రోజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రదానం చేశారు. 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్, 56 మంది కానిస్టేబుల్ నుండి ఐపిఎస్ లు సిల్వర్ మేడల్స్, 05 మంది డిఎస్పీలు,ఏఎస్ఐ లు బ్రోంజ్ మేడల్స్ ను డిజిపి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
కన్విక్షన్ బేస్ పోలిసింగ్ విధానాన్ని గత సంవత్సరం (2022) జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సిపి/ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు/ఆరు కేసులు తమ పర్యవేక్షణలో ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతంలో గణనీయంగా అదుపు చేయడం జరిగింది. కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని గత సంవత్సరం(2022) నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము. ఈ విధానం ద్వారా నేరాల తీవ్రత ఆధారంగా గత సంవత్సరంలో గుర్తించిన 165 కేసుల్లో న్యాయస్థానాలలో విచారణ పక్రియ పూర్తి చేసుకొని నూటికి 100? శాతం నిందితులకు శిక్షలు విధించిన కోర్టులు.
అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన అవినీతి నిరోధక శాఖ, సిఐడి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటలిజెన్స్, ఏపిఎస్పి బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబి) విభాగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలను సేకరించడం జరుగుతుంది. త్వరలోనే వారికి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి డిస్క్ అవార్డులను అందించడం జరుగుతుంది.
క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందించడం జరుగుతుంది. వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ మెడల్స్ అందించడం ద్వారా మరింత ఉత్సాహంతో వారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతగానో దోహద పడుతుందని వివరించారు.