16-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 16): భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 20వ తేదీన పోలిపల్లి గ్రామంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఆ సభకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ పాల్గంటారు. ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ సభకి 16 కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సభకి 6 లక్షలు మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నాం. వైసీపీ కౌట్ డౌన్ ప్రారంభమైంది. వైసీపీలోని అనేకమంది టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు.
ఇది యువగళంలో భాగంగానే జరుగుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ మ్యానిఫెస్టో సిద్ధం కాకపోవడంతో ఈ సభకి పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదు. త్వరలో పూర్తి మ్యానిఫెస్టో సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యలో భారీ సభ నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవ చేశారు.