16-12-2023 RJ
తెలంగాణ
నిజామాబాద్, (డిసెంబర్16): బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువుల రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. మిల్లుల్లో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. రెండు సీజన్లో కలిపి 50732 టన్నుల ధాన్యం అప్పగించినట్లు సమాచారం. 33228 టన్నుల ధాన్యం బకాయి పడినట్లు సమాచారం. ఈ ధాన్యం విలువ 9 కోట్లుగా అధికారులు గుర్తించారు. ధాన్యం కోసం వెళ్తే రైస్ మిల్లుల్లో ధాన్యం లేకపోవడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.