17-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో పవిత్రమైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి రెజిమెంటల్ బజార్ లోని కీస్ హై స్కూల్ లో శ్రీ ధర్మశాస్త్ర భక్తబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ లో ఆయన పాల్గొన్నారు.
స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పూజలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, వెంకటనారాయణ, రాజు, చంద్ర శ్రీను, ఎర్రం శ్రీను, ప్రఫుల్, శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు.