18-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్18): కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, సిఎం రేవంత్ ఆదేశాలతో నగరంలో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడుతోంది. అయితే ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వీటిపై ప్రధానంగా దృష్టి సారించాలి. కేవలం పోలీసులు చలాన్లు వేయడం, చాటుమాటున ఫోటోలు తీయడం, బ్యారికేడ్లు పెట్టి డ్రంకన్ డ్రైవ్లు చేయడంతోనే సరిపెడుతున్నారు. ఇకపోతే నగరంలో పలుచోట్ల యూటర్న్ లు పెట్టి అసలు పోలీసులు లేకుండానే ట్రాఫిక్ను పోనిచ్చే పని చేపట్టారు. దీనిని సవరించాల్సి ఉంది.
రోడ్డు మధ్యలో సిమెంట్ దిమ్మెలు ప్రమాదకరంగా మారాయి. లాకాకుండా సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేసి, దానిని ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ గత పదేళ్లలో దీనిపై ఎక్కడా శ్రద్ద కానరాలేదు. ఇప్పటికైనా దీనిపై సిఎం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇనుప కంచెలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తున్న తరుణంలో ప్రధాన ట్రాఫిక్ సమస్యలపై చర్చించాల్సి ఉంది. ప్రగతిభవన్ ముందు, అసెంబ్లీ ముందు ఇనుప కంచెలు తొలగించడంతో ప్రజలు స్వాగతిస్తున్నారు.
మరోవైపు సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా సీఎం, మంత్రుల కాన్వాయ్ లు వెళ్లే రూట్లను స్టడీ చేస్తున్నారు. సాధారణ ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ జంక్షన్ ను సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మార్చారు. నాంపల్లి, లక్డికాపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు అగకుండా ఏర్పాట్లు చేశారు.
బషీర్ బాగ్ నుంచి లక్డికాపూల్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ చేశారు. బషీర్ బాగ్ ప్లై ఓల్గ-వర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్.. ఓల్డ్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో యూటర్న్ తీసుకుంటున్నాయి. దీంతో పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ ముందు వెహికల్స్ నిలిచే అవకాశం ఉండదు. ఈ ట్రయల్ రన్ మంచి ఫలితాలు ఇస్తే యూటర్ ను కంటిన్యూ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లోనూ సిగ్నల్ ఫ్రీ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. సీఎం, మంత్రుల కాన్వాయ్ మూవ్మెంట్స్ సమయాల్లో సాధారణ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్లానింగ్ రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బేగంపేట పరిసరాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి జనం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
సందర్శకుల వాహనాల పార్కింగ్, సికింద్రాబాద్, పంజాగుట్ట నుంచి ట్రావెల్ చేసే వెహికల్స్ కు ఫ్రీ మూవ్మెంట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లోనూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. సీఎం వెళ్లే రూట్లో సమస్యలు తలెత్తకుండా అవసరమైన విధంగా గ్రీన్ చానల్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్, వరంగల్. మెహదీపట్నం రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ చిక్కులు ఉన్నాయి. వీటిని అధ్యనం చేయాల్సి ఉంది.