18-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయనగరం, (డిసెంబర్18): ఏపీలో బిజెపికి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో చాలా మందికి తను చేసే పనులు నచ్చలేదనే విషయం అర్ధం అవుతుందని అన్నారు. పార్టీకి విధేయుడిగా అన్ని పనులు చేశానని తెలిపారు. వ్యక్తిగత సమస్యలు వల్ల బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చీపురుపల్లి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ పనిచేశారు. టీడీపీ వల్లే ఈ రోజు స్థాయిలో ఉన్నానని, అనుకోని కారణాలు వల్ల టీడీపీ వీడి బిజెపికి వచ్చానని తెలిపారు. టీడీపీ నుండి బయటకు వచ్చిన నేను ఏ పార్టీని విమర్శించలేదని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరాలి అనే నిర్ణయం కార్యకర్తలు, నాయకులను అడిగి తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఆయన మళ్లీ టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది.