18-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, (డిసెంబర్18): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చి, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారని ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడు అన్నారు. గత టీడీపీ పాలనలో ఇసుక, మట్టిని ఇష్టారాజ్యంగా దోచుకు తిన్నారని, వైఎస్సార్ సీపీ పాలనలో అలాంటివి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించామన్నారు.
టీడీపీ నాయకులు మాఫియాగా తయారై, మట్టి, ఇసుక దోచుకున్నారని విమర్శించారు. పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నదని, అందులో భాగంగానే రైతులకు సబ్సిడీపై ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా వంటివి అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సి క్లాస్ భూములను సాగు చేస్తున్న రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు యజమానులుగా చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం పదేళ్లుగా పట్టాలివ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కట్టుగా వస్తున్నాయని, ప్రజలు మేలు చేసే ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరించాలన్నారు.