18-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ అగ్ర నటి సమంత అభిమానుల కోసం కుదిరిన ప్రతిసారీ సమయం కేటాయిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా చాటింగ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు నెటిజన్లు ఆకతాయి ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోతే ధీటుగా సమాధానం ఇస్తారు సామ్. తాజాగా అలాంటి ఘటనే సామ్కు ఎదురైంది.. 'మళ్లీ పెళ్లిపై మీరెందుకు ఆలోచించకూడదు?” అని తాజాగా ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె స్పందించారు.
విడాకులకు సంబంధించిన లెక్కల్ని చూపిస్తూ.. ఈ లెక్కల ప్రకారం అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొని దానికి స్మైలీ ఎమోజీ జోడించారు. ’కీ డివోర్స్ స్టాటిస్టిక్స్' పేరుతో సమంత షేర్ చేసిన ఇమేజ్.. 2023లో.. మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉండగా, రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్ ఇలానే ఉందట' అని పేర్కొన్నారు.
మరో నెటిజన మీరు దేవుడిని నమ్ముతారా? అంటే నమ్ముతానని సమంత చెప్పారు. మనం గురించి మనకు బాగా తెలుసని అనుకుంటాం. అదే సమయంలో కొన్ని సర్ప్రైజ్ లు జరుగుతుంటాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. అవును.. కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. ఆరెండు ఉంటేనేగా మన జీవితం యునీక్ గా ముందుకెళ్తుంది' అని చెప్పారు. రానున్న సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.