18-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ కాంపౌండ్ నుంచి ప్రస్తుతం గూఢచారి 2 రాబోతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్న అడివిశేష్ తాజాగా లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను - నైల్ చేశారన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీకి డెకాయిట్ టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇన్సైడ్ టాక్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ పాట కూడా పాటబోతుందట. ఈ భామ మంచి సింగర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే శృతిహాసన్ ఫస్టి గ్లింప్స్ న విడుదల చేశారు.
ముఖంపై స్కార్ఫ్ చుట్టుకొని తీక్షణ చూపులతో సీరియస్ గా కనిపిస్తున్నది శృతిహాసన్. డెకాయిట్ - నైల్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీజనాలు. తొలిసారి శృతిహాసన్, అడివిశేష్ కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. షనీల్ డియో డెబ్యూ (డైరెక్టర్) ఈ చిత్రానికి కథనందిస్తూ దర్శకత్వం వహించనున్నాడు. శృతిహాసన్ రీసెంట్గా హాన్నాన్నలో ఓడియమ్మా పార్టీ సాంగ్లో మెరిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో వచ్చిన 'గూఢచారి' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'జీ2' (ఉ2) చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అడివి శేష్.. 'జీ2' (ఉ2) నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.