19-12-2023 RJ
తెలంగాణ
న్యూఢిల్లీ, (డిసెంబర్19): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు.
అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు.