19-12-2023 RJ
తెలంగాణ
నిజామాబాద్, (డిసెంబర్19): జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. మాక్లూరు చెందిన తన మిత్రుడు ప్రసాద్ పాటు భార్య రమణి, ఇద్దరు పిల్లలు చైత్రిక, చైత్రిక్ చెల్లెల్లు స్వప్న, స్రవంతిలను ప్రశాంత్ చంపేశాడు. ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకునేందుకు నిందితుడి గ్యాంగ్ ఈ వరుస హత్యలకు పాల్పడింది.
ప్రశాంత్ రాజకీయ అండదండలతో భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్ కు చెందిన ఇంటిపై కన్ను పడగా.. దానిని సొంతం చేసుకునేందుకు ప్రశాంత్ ఇంత దారుణంగా ఆరుగురిని హతమార్చాడు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించనున్నారు.