19-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (డిసెంబర్ 19): కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తుఫాను కారణంగా పంట నష్ట పోవడంతో అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తకెళ్ళ శ్రీ పూర్ణయ్య(35) పురుగు మందు తాగాడు. శ్రీ పూర్ణయ్య 15 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. తుఫాను కారణంగా పొలం పడిపోయి మొలిచిపోవడంతో కోత కోసెందుకు వీలు కాని పరిస్థితితో కౌలు రైతు తీవ్ర మనస్తాపం చెందాడు.
దీంతో ఈరోజు (మంగళవారం) ఉదయం పొలం వెళ్లి పురుగుల మందు తాగి పడిపోవడంతో సమీప రైతులు గుర్తించారు. వెంటనే పూర్ణయ్యను అవనిగడ్డ ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పూర్ణయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని పూర్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు.