19-12-2023 RJ
సినీ స్క్రీన్
చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం 'రాచరికం'. విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. అనంతరం నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ చిత్రానికి వెంగి సంగీతాన్ని అందిస్తుండగా, కెమెరామెన్ గా ఆర్య సాయి కృష్ణ, జేపీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ.. 'చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ మీద రాచరికం అనే సినిమాను తీస్తున్నాము. ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం మంచి రెస్సాన్స్ దక్కించుకుందని.. గ్లింప్స్ వెంగి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందని, నాకు సహకరించిన టీంకు, మా ఈవెంట్ కు గెస్టులుగా వచ్చిన రాజ్ కందుకూరి, డీఎస్ రావులకు థాంక్స్' అని అన్నారు.
నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. 'దర్శకుడు సురేష్తో ఆరు నెలలుగా ప్రయాణించామని సినిమా అద్భుతంగా వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోందని, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అన్నారు. ఈ మూవీ తరువాత ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది' అని అన్నారు.