19-12-2023 RJ
సినీ స్క్రీన్
తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు నిహారిక కొణిదెల, నాగబాబు కూతురుగా వెబ్ సిరీస్లతో, గేమ్ షోలతో ఇప్పటికే సుపరిచితమైన ఈ అమ్మడు ఒక మనసు సినిమాతో వెండితెర ప్రవేశం కూడా చేసింది. ఆ తర్వాత మరో రెండు చిత్రాలు చేసి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అనంతరం పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చకచకా అయిపోయాయి. ఆపై నిర్మాతగా మారి ఓటీటీకి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మించింది.
తాజాగా నిహరికా సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం అమె జన్మదినం సందర్భంగా సిక్స్ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న 'వాట్ ద ఫిష్' చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నిహారిక స్టైలిష్ గా నడుస్తూ కనిపించింది. ఈ పాత్రని యూనిక్ గా డిజైన్ చేసినట్లు దర్శకుడు చెప్పారు.
ఈ సినిమాతో వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయమవుతుండగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 10 నెలల క్రితంమొదటిసారి ఈ సినిమా టైటిల్ ను వాట్ ది ఫిష్ ప్రకటించగా, ఈ యేడాది మే నెలలో మనోజ్ జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ తో మరో గ్లింప్స్ విడుదల చేసి 'వాట్ ద ఫిష్' అంటూ సినిమా ట్యాగ్ లైన్ మార్చారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు 6 నెలల తర్వాత నిహారికా ఆన్ ది బోర్డ్ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.
నిహారిక ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా మంచు మనోజ్ పేరు ప్రస్తావన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. సోషల్ మీడియాల్లోనూ ఎక్కడా ఆయన పేరు కనబడలేదు అఖరుకు చిత్ర నిర్మాతలు మనోజ్ పేరును కూడా ట్యాగ్ చేయకపోవడం వెనకాల మతలబేంటి అనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ సినిమా నుంచి మనోజ్ ఏమైనా తప్పుకున్నాడా, నిహారికా హీరోయినా లేక ప్రధాన పాత్ర చేస్తుందా, అనే చాలా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సన్నాహాలు చేస్తున్నారు.