19-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య జిల్లా, (డిసెంబర్19): వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుని శెట్టి రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమేష్ వైసిపి కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి ప్రశాంతితో కలిసి కొరముట్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివసాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.