ad1
ad1
Card image cap
Tags   New Delhi

  19-12-2023       RJ

ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్..ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమీక్ష

తెలంగాణ

న్యూఢిల్లీ, (డిసెంబర్19): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయడంతో ఈరోజు సీఎం రేవంత్ సందర్శించారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గల బంగ్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అలాగే ఎపి భవన్పైనా అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ బవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

న్యూఢిల్లీ లోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎన్డీ సంజయ్ జాజుతో మంగళ వారం ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత....? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని... అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు 41.68:58.32 నిష్పత్తి లో వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు... మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ మిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలుసూచనలు ఇచ్చారు. మంగళ, బుధవారం ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. కాగా.. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వచ్చే అవకాశం ఉంది.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP