20-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 20): ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా.. సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం, ట్వీట్(ఎక్స్) లో డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామన్నారు.
పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల వేళ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రవిగుప్తా డీజీపీగా బాధ్యతలు చేపట్టగా.. తాజాగా ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.